పరిధి దాటి ఆలోచించాలి

Sun,April 14, 2019 02:51 AM

RBI Governor says India economy needs to grow even faster

-ప్రస్తుత ద్రవ్య విధాన సవాళ్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
-భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సిద్ధాంతాల పునఃసమీక్షకు పిలుపు
వాషింగ్టన్, ఏప్రిల్ 13:ఈ 21వ శతాబ్దంలో ఎదురవుతున్న ద్రవ్య విధాన సవాళ్ల పరిష్కారానికి పరిధులు దాటి ఆలోచించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరైన దాస్.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఇబ్బందులు, విధాన మార్పు లు అంశంపై ప్రసంగించారు. దాస్ ఇచ్చిన పిలుపునకు అందరి నుంచీ మద్దతు లభించగా, ప్రస్తుత ద్రవ్య సిద్ధాంతాల పునఃసమీక్ష అవసరం ఉందన్నారు. మరోసారి ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంకేతాలు కనిపిస్తున్న వేళ అభివృద్ధి చెందిన దేశాల అసాధారణ ద్రవ్య విధానాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఈ మూడు రోజుల సమావేశానికి విచ్చేయగా, జీ-20 దేశాలకు జపాన్ నాయకత్వం వహిస్తున్నది.

ఈ ఏడాది ఆఖరుకల్లా..

ఈ ఏడాది ఆఖరుకల్లా ప్రపంచ జీడీపీ బలోపేతం కాగలదన్న విశ్వాసాన్ని జీ-20 దేశాల నేతలు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వృద్ధిరేటు మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర బ్యాంకులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ సంప్రదింపుదారుల నుంచి అందివస్తున్న సాయం గ్లోబల్ ఎకానమీ వృద్ధికి దోహదపడగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో వృద్ధిరేటు పుంజుకోవడం మొదలు కాగలదన్న అంచనాల్ని కనబరిచారు. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ అంచనాను ఐఎంఎఫ్ 3.3 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. నిరుడు ఇది 3.6 శాతంగా ఉన్నది.

వృద్ధికి ఊతమివ్వాలి

పడిపోతున్న ప్రపంచ జీడీపీకి దన్నుగా నిలువాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని బ్యాంక్ ఆఫ్ జపాన్ అధిపతి హరుహికో కురోడా అన్నారు. ప్రపంచ దేశాలు వృద్ధిరేటు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా విధానాలను అమలు పరుచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టిందని ఐఎంఎఫ్ ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ చాంగ్‌యాంగ్ రీ అన్నారు. ఈ రెండు అగ్ర దేశాలు తమ పంతాల్ని వీడి రాజీ పడితే ప్రపంచ జీడీపీ పుంజుకోవడానికి ఎంతో సమయం పట్టదన్న భావనను వ్యక్తం చేశారు.

1807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles