ఆర్బీఐ ఉనికి హుళక్కే!

Sat,November 17, 2018 12:58 AM

RBI board to meet on Nov 19 Heres whats on the agenda

-తెరపైకి అథారిటి ఆఫ్ ఆర్బీఐ బోర్డు
-బోర్డు ఇక మేనేజ్డ్ ఇనిస్టిట్యూషన్
-చట్ట సవరణ, పార్లమెంట్ ఆమోదం లేకుండా అమలు
-19న బోర్డు సమావేశంలో ఇక తాడోపేడో

న్యూఢిల్లీ, నవంబర్ 16: సోమవారం జరగబోయే బోర్డు సమావేశానికి ముందే రిజర్వ్‌బ్యాంక్ ఉనికి ప్రమాదం తెచ్చే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రిజర్వ్‌బ్యాంకు ఎలా పనిచేయాలన్న అంశంపై కొత్త నిబంధనలను ప్రభుత్వం తెరపైకి తెస్తున్నది. రిజర్వ్‌బ్యాంకు బోర్డును మేనేజ్డ్ ఇనిస్టిట్యూషన్‌గా మార్చడానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ప్రముఖ బిజినెస్ టీవీ ఛానెల్ సీఎన్‌బీసీ టీవీ-18 వార్తను ప్రసారం చేసింది. ఈ కొత్త ప్రతిపాదనలు సోమవారం జరిగే బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం రిజర్వ్‌బ్యాంకు చట్టాన్ని సవరించకుండానే , పార్లమెంట్ ఆమోదం లేకుండానే ఆర్బీఐ బోర్డును మేనేజ్డ్ ఇనిస్టిట్యూషన్‌గా మార్చే వీలుంది.

దీనిప్రకారం అథారిటీ ఆఫ్ ఆర్బీఐ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. తద్వారా కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు పట్టు సడలిపోనుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై రాజీపడితే అది పెద్ద విపత్తే అని రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యానించినప్పటి నుంచి కేంద్రం- రిజర్వ్‌బ్యాంక్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ ప్రయోగించని సెక్షన్ 7 ఉపయోగించడంపై ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రతిపాదనలు చేయడం విభేధాలు మరింత ముదిరాయి. సోమవారం జరిగే రిజర్వ్‌బ్యాంకు బోర్డు సమావేశంలో ప్రభుత్వం నామినేట్ చేసిన గురుమూర్తి లాంటి సభ్యులు ఈ కొత్త ప్రతిపాదనల చర్చకు లేవనెత్తనున్నారు. దీంతో బోర్డు సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది రిజర్వ్‌బ్యాంక్ స్వతంత్రతకు గొడ్డలి పెట్టు

ఇప్పటికే ఎస్ గురుమూర్తి లాంటి వ్యక్తిని నియమించి రిజర్వ్‌బ్యాంక్ ైస్థెర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రణాళిక సంఘాన్ని నిర్వీర్యం చేసిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు రిజర్వ్‌బ్యాంకును నిర్వీర్యం చేస్తున్నారు.
-వీరప్ప మొయిలీ, ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంట్ సంఘం ఛైర్మన్

ఈ ప్రతిపాదన వార్త తప్పు కావాలని అనుకుంటున్నా ను. ఒకవేళ నిజమే అయితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు.
- యశ్వంత్ సిన్హా , మాజీ ఆర్థిక మంత్రి

ఎన్‌పీఏలపై అప్పుడెందుకు స్పందించలేదు..

GURU
రిజర్వ్‌బ్యాంక్ విధానాలను బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి తూర్పారబట్టారు. 2009 నుంచి ఉన్న మొండి బకాయిల సమస్య 2014నాటికి తీవ్రతరమైంది. 2015 లో మొండిబకాయిలక కేటాయింపులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభంలోనే కేటాయింపులు చేసి ఉంటే అసలు మొండిబకాయిల సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు అని ఆయన విమర్శించారు. రిజర్వులు సగటున 12నుంచి 19 శాతం వరకు ఉండాలని అధ్యయనాలు వెల్లడించాయి. కానీ, రిజర్వ్‌బ్యాంకు వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. వీటిపై స్పష్టమైన విధానాలు అవసరమని అయన అన్నారు. క్రమానుగత విధానాలను అమలుచేయకపోతే షాక్‌లు ఉత్పన్నమవుతాయని, లేని సంక్షోభాలను ఆహ్వానించినట్టు అవుతుందన్నారు. ఆర్బీఐ - కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఆహ్వానించదగ్గవి కావని, ప్రత్యామ్నాయాలు తప్పనిసరని అన్నారు. దీంతో సోమవారం జరిగే సమావేశంలో గురుమూర్తి తీవ్ర స్థాయిలో ప్రభుత్వ ఎజెండాను బోర్డు ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles