యెస్ బ్యాంక్

Sat,January 12, 2019 11:52 PM

RBI approves appointment of Brahm Dutt as Yes Bank non executive chairman

నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బ్రహ్మ దత్
న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన యెస్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ తాత్కాలిక చైర్మన్‌గా బ్రహ్మదత్‌ను నియమించుకున్నది. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 చట్టం ప్రకారం తాత్కాలిక చైర్మన్‌గా నియమితులైన దత్..ఈ పదవిలో జూలై 4, 2020 వరకు ఉండనున్నారు. జూలై 2013 నుంచి ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. దీంతోపాటు ప్రస్తుతం ఆయన నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు కూడా. ఆయనతోపాటు యెస్ బ్యాంక్ బోర్డులో ముకేశ్ సభర్వాల్, సుభాష్ కాలియా, అజయ్ కుమార్, ప్రతిమా, ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్, టీఎస్ విజయన్, రాణా కపూర్(బ్యాంక్ ఎండీ, సీఈవో)లు ఉన్నారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles