ఆర్బీఐపై అందరి కళ్లు

Sat,September 14, 2019 03:13 AM

RBI Another Opportunity to Reduce Interest Rates

-మరోదఫా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం
-అక్టోబర్ 4న తన తదుపరి సమీక్ష

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: రిజర్వు బ్యాంక్ మరోదఫా వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ సెంట్రల్ బ్యాంక్ అంచనావేసిన స్థాయిలోనే ఉండటం, నెమ్మదించిన పారిశ్రామిక ప్రగతి మళ్లీ పుంజుకోవాలంటే వచ్చే నెల 4న ప్రకటించబోయే పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం, ప్రతికూల వృద్ధి మధ్య అంతరాన్ని పూడ్చాలంటే వచ్చే పాలసీలో వడ్డీరేట్లలో కోత విధించాలని జాతీయ, అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో జూలైలో ఉన్న 3.15 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. అలాగే తయారీ రంగం దెబ్బకు జూలైలో పారిశ్రామిక వృద్ధి 4.3 శాతానికి పరిమితమైంది.

ఈ ఏడాది చివరి నాటికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు వీలున్నదని జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ నోమురా విడుదల చేసిన రిసర్చ్ నోట్‌లో పేర్కొంది. మరో సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. గత నెలలో ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ అంచనావేసిన దానికంటే 3.2 శాతంగా నమోదవడంతో వచ్చే నెల సమీక్షలో గరిష్ఠంగా అర శాతం వరకు వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలు కలిగిందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించకతప్పదని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. వచ్చే మార్చి నాటికి గరిష్ఠంగా 75 బేసిస్ పాయింట్లు తగ్గిస్తాదని అనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles