కలిసి నడువాలి కేంద్రం, ఆర్బీఐకి పనగరియా హితవు

Fri,November 9, 2018 12:33 AM

RBI and govt should resolve differences come together in national interest

న్యూఢిల్లీ, నవంబర్ 8: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభేదాల నేపథ్యంలో ఇరుపక్షాలు సర్దుకుపోవాలని, జాతి ప్రయోజనాల దృష్ట్యా కలిసి ముందుకెళ్లాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా హితవు పలికారు. నిజానికి అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌తో పోల్చితే భారత్‌లోని ఆర్బీఐకి లీగల్‌గా తక్కువ స్వేచ్ఛే ఉందన్న ఆయన అయినప్పటికీ ఫెడరల్ రిజర్వ్ స్థాయిలోనే ఆర్బీఐకీ స్వేచ్ఛ లభిస్తున్నదని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పనగరియా అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా కేంద్రం, ఆర్బీఐ మధ్య గొడవలు దేశానికి మంచివి కావన్న ఆయన జాతి ప్రయోజనాల దృష్ట్యా అన్నింటినీ మరిచి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతి విపత్కర పరిస్థితుల నడుమా అమెరికా ప్రభుత్వం, ఫెడ్ రిజర్వ్ కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. గడిచిన కొంతకాలంగా పలు కీలకాంశాలపై అటు ఆర్బీఐ, ఇటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వేర్వేరు అభిప్రాయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య వ్యాఖ్యలు ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య దూరాన్ని పెంచగా, సెక్షన్ 7 ప్రయోగం ఆరోపణలు, గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా అంశాలు విభేదాల్ని తారాస్థాయికి చేర్చిన విషయం తెలిసిందే.

315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles