ఎస్తోనియా ఈ-రెసిడెన్సీ ఆఫర్

Thu,January 10, 2019 11:37 PM

తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ
హైదరాబాద్, జనవరి 10: ఉన్నత విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వంతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఎస్తోనియా యోచిస్తున్నట్టు ఆ దేశ రాయబారి రిహోక్రువ్ తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో లీడర్ హైదరాబాద్ ఎంపికైనందున, దేశంలోనే ముఖ్యమైన ఐటీ హబ్‌గా ఎదిగినందున అపార అవకాశాలున్నాయని అన్నారు. ఎస్తోనియా ప్రారంభించిన ఈ-రెసిడెన్సీ ప్రోగ్రామ్ ద్వారా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకునే వీలుంటుందని వెల్లడించారు. ఇప్పటికే 2,200 మందికిపైగా భారతీయులు 275 కంపెనీలు నెలకొల్పారని వెల్లడించారు.

ముకేశ్ అంబానీ ఎస్తోనియాలో ఈ రెసిడెన్సీ ద్వారా కంపెనీని నెలకొల్పి జియో కోసం డిజిటల్, కమ్యూనికేషన్స్ రంగాలలో పనిచేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, దీపక్ సోలంకి వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా ఎస్తోనియాలో కార్యాలయాలను తెరిచినట్టు తెలిపారు. కేవలం వంద యూరోలతో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా డిజిటల్ ఈ-రెసిడెన్సీ కార్డు పొంది ఆ దేశ పౌరుల మాదిరిగానే అన్ని సదుపాయాలను పొందవచ్చునని వెల్లడించారు. సులభ పన్ను విధానాలు, అతి తక్కువ అవినీతి కలిగిన ఎస్తోనియాలో కార్యాలయాలను నెలకొల్పడం ద్వారా మొత్తం యూరోపియన్ దేశాలకు విస్తరించే వీలుంటుందని తెలిపారు. కేవలం గత ఏడాది కాలంలోనే 200 భారతీయ కంపెనీలు ఎస్తోనియాలో అడుగు పెట్టాయని చెప్పారు.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles