ఇండిగోలో భగ్గుమన్న విభేదాలు

Wed,July 10, 2019 04:13 AM

Rakesh Gangwal writes to Sebi escalating IndiGo feud

న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ భాటియా కారణంగా సంస్థ పాన్‌ షాప్‌ కంటే అధ్వాన్నంగా తయా రైందని, తీవ్ర పాలనాపరమైన లోపాలు చోటుచేసుకుంటున్నాయని నాన్‌-ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్ట ర్‌ రాకేశ్‌ గంగ్వాల్‌ మంగళవారం ఆరోపించారు. దీంతో దాదాపు ఏడాది కాలంగా నివురు కప్పిన నిప్పులా ఉన్న భేదాభిప్రాయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సంస్థ లో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను చక్కదిద్దడానికి మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ జోక్యా న్ని కూడా గంగ్వాల్‌ కోరుతున్నారు. మరోవైపు గంగ్వాల్‌ నుంచి ఓ లేఖను తమ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు అందుకున్నారని, సెబీ కూడా ఈ లేఖపై స్పందనను కోరిందని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇండిగో తెలియజేసింది. మే నెలలో ప్రమోటర్ల మధ్య విభేదాలున్నాయన్న వార్త లు వచ్చిన దగ్గర్నుంచి సెబీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతబడటం, ఎయిర్‌ ఇండియా రుణ భా రం, ప్రైవేటీకరణ అంశాలతో దేశీయ విమానయాన రంగం సంక్షోభంలో ఉన్న వేళ ఇండిగో విభేదాలను సెబీ సీరియస్‌గా తీసుకున్నది.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles