బజాజ్ ఫిన్ నుంచి తప్పుకున్న రాహుల్

Thu,March 14, 2019 12:47 AM

Rahul Bajaj resigns as Bajaj Finserv Chairman

న్యూఢిల్లీ, మార్చి 13: బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ బజాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ వచ్చే మే నుంచి ఆయన గౌరవ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. మే 16న జరుగనున్న బోర్డు సమావేశం ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకోను న్నది. దీంతో మే 16 నుంచి ఆయన కంపెనీకి గౌరవ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీంతో ఆయన స్థానంలో నానూ పమ్నానిని ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించింది కంపెనీ. ఈ నియామకం మే 17, 2019 నుంచి అమలులోకి రానున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అలాగే కం పెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా డీజే బాలాజీ రావు, నానూ పమ్నాని, గీతా పిరమల్‌లను మరో ఐదేండ్లపాటు తిరిగి నియమించింది సంస్థ.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles