పీడబ్ల్యూసీపై రూ.229 కోట్ల జరిమానా

Sat,September 14, 2019 03:08 AM

PWC fined Rs 229 crore

-షోకాజ్ నోటీసు జారీ చేసిన ఈడీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్(పీడబ్ల్యూసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా నిబంధనలను వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంస్థపై రూ.229 కోట్ల జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం షోకాజ్ నోటీసును పంపింది. ఈడీ ప్రత్యేక డైరెక్టర్(తూర్పు ప్రాంతం) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విదేశీ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) చట్టానికి లోబడి ఈ నోటీసు జారీ చేసింది. కంపెనీతోపాటు మరో ఆరుగురిపై 4,98,42,747 డాలర్ల జరిమానా విధించింది. మన కరెన్సీలో ఇది రూ.2,30,40,70,000. కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వు బ్యాంక్ జారీ చేసిన ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను పలు సెక్షన్ల కింద ఈ భారీ జరిమానా విధించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఎన్‌జీవో చేసుకున్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా సంస్థ ఆర్థిక సేవలు, ఫైనాన్షియల్ ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ రిస్క్ కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, ఒప్పందాలు, లావాదేవీల సేవలు అందిస్తున్నది. పీడబ్ల్యూసీ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ చైర్మన్ శ్యామలా ముఖర్జీ, డైరెక్టర్ సత్యవతి బెహెరా, మాజీ చైర్మన్ దీపక్ కపూర్, రమేశ్ రంజన్, మాజీ ఈడీ అంబరిష్ దాస్‌గుప్తా, మాజీ ఉద్యోగి శివమ్ దుబేలకు నోటీసులు పంపింది. ఈ నోటిసుపై వచ్చే 45 రోజుల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సూచించింది.

201
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles