హాల్‌మార్కింగ్‌తో లాభం

Thu,December 5, 2019 12:20 AM

-మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్

హైదరాబాద్, డిసెంబర్ 4: బంగారు ఆభరణాలపై చట్టబద్ధమైన హాల్‌మార్కింగ్‌తో వినియోగదారులకు లాభాలు చేకూరుతాయని ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా బంగారు నగలకు బీఐఎస్ హాల్‌మార్కింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని ఆయన స్వాగతించారు. ప్రభుత్వ ఆమోదిత ప్రమాణాలను అనుసరించడం వల్ల కొనుగోలుదారుల్లో నమ్మకం పెరుగుతుందని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అన్నారు. దీనివల్ల అమ్మకాలు కూడా పెరుగుతాయని చెప్పారు. కాగా, ఎలాంటి మోసాలకు తావులేకుండా బంగారు ఆభరణాలపై బార్‌కోడ్‌లు తప్పనిసరి చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి సూచించారు.

261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles