పంటల ఉత్పాదకత పెరుగాలి

Sat,November 9, 2019 12:51 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని, రానున్న రోజుల్లో ఆహార భద్రతకు ఎలాంటి ఢోకా లేదని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర చెప్పారు. దేశంలో పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడం ద్వారా ప్రధాని మోదీ ఆశిస్తున్న ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఉత్పత్తి పెరిగింది, అయితే ఉత్పాదకత పెరుగాల్సిన అవసరమున్నదన్నారు. 1951తో పోలిస్తే ఐదున్నర రెట్లు ఉత్పత్తి పెరిగిందని, 2019-20లో 285 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగిందని తెలిపారు.


బంగాళదుంప దిగుమతి చేసుకొంటున్న తరుణంలో.. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల వృద్ధి సహా సంప్రదాయ ప్రాంతాలతోపాటు సంప్రదాయేతర రాష్ట్రాల్లో పంట సాగు, విస్తీర్ణం, ఉత్పాదకత పెంపు, అదనపు విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వల్ల దాదాపు 95 శాతం విస్తీర్ణం దేశీయ రకాలే సాగవుతున్నాయని, తద్వారా ఏటా రూ.55 వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. అలాగే కటక్ వరి పరిశధన సంస్థ ద్వారా విడుదలైన వరి రకాల సాగు ద్వారా ఏటా రూ.48 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. రెండ్రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో పద్మభూషణ్ ప్రొఫెసర్ జీ పద్మనాభన్, ఉదయ్‌పూర్ మహారాణాప్రతాప్ వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్‌ఎల్ మెహతా, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, ఐసీఏఆర్ సంచాలకుడు డాక్టర్ ఎస్‌ఆర్ ఓలేటి, నార్మ్ సంచాలకుడు సీహెచ్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles