సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధం

Sat,September 7, 2019 01:19 AM

Prepare for new challenges, protect Indian cos from abuse by global firms

-2014 నుంచి అదుపులోనే ద్రవ్యోల్బణం: నిర్మలా సీతారామన్

కోల్‌కతా, సెప్టెంబర్ 6: తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని రంగాల సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రంగాల సమస్యలను పరిష్కరించినట్లు, త్వరలో మిగతా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు విలేకరులతో చెప్పారు. ఒక్కోక్క రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు, ఆమోదయోగ్యమైన ఏదైన సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్బీఐ కేటాయించిన రూ.1.76 లక్షల కోట్ల నిధులపై కేంద్రం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు 2014 నుంచి ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు.

237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles