పీఎంఎస్‌వైఎం పెన్షన్‌లోకి అసంఘటిత కార్మికులు

Sun,February 10, 2019 12:39 AM

Pradhan Mantri Shram Yogi Mandhan Pension

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 40 ఏండ్ల లోపు కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి శ్రామ్ యోగీ మన్‌ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకం కిందకురావాలంటే ఈ నెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో సూచించింది. అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టింది. నెలకు రూ.15 వేల లోపు ఆదాయం కలిగివున్న కార్మికులకు ఈ పెన్షన్ తీసుకోవడానికి అర్హులు. 60 ఏండ్ల తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ రూపంలో లభించనున్నాయి. వచ్చే ఐదేండ్లకాలంలో ఈ పథకం కింద 10 కోట్ల మందికి ప్రయోజనం కలుగనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ స్కీంలో చేరాలంటే నెలకు కనీసంగా రూ.55 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వారి వయస్సును బట్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 40 ఏండ్లు కలిగిన కార్మికుడు నెలకు రూ.200 చొప్పున, అలాగే 29 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇండ్లలో పనిచేసేవారు, విధుల్లో విక్రయించేవారు, మధ్యాహ్నా భోజన కార్మికులు, రిక్ష, వ్యవసాయ, నిర్మాణ, క్లింకర్లలో పనిచేసేవారు ఈ పెన్షన్ స్కీంను తీసుకోవచ్చును.

2216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles