బెయిల్ ఇవ్వద్దు.. జైలుకే పంపండి

Thu,October 10, 2019 01:20 AM

పీఎంసీ బ్యాంక్ కేసులో ఆర్బీఐ చర్యలను తప్పుపట్టిన ఖాతాదారులు
ముంబై, అక్టోబర్ 9: పంజాబ్, మహారాష్ట్ర సహాకార(పీఎంసీ) బ్యాంక్ ఖాతాదారులు ఆందోళనబాట పట్టారు. బ్యాంక్ ఆర్థిక సంక్షోభానికి కారణమైన వారిపై రిజర్వు బ్యాంక్ తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టిన వీరు.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు గుమ్మిగుడి వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ భారీ మోసానికి పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వవద్దని..జైలుకే పంపాలని వాళ్లు డిమాండ్ చేశారు. కోపోద్రిక్తులైన పలువురు కోర్టు ఆవరణలో ఉన్న వాహనాలపై దాడులు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకు విత్‌డ్రాలో పరిమితి విధించడంతో ఇరుక్కుపోయాయని, మా పొదుపు సొమ్ము ను వెంటనే ఇవ్వాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లు సారంగ్, రాకేశ్ వాద్వాన్‌లను ఈ నెల 14 వరకు పోలీస్ కస్టడిలో ఉండాలని కోర్టు ఆదేశించింది.

424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles