ఫోన్‌పే@200 కోట్ల లావాదేవీలు

Tue,April 16, 2019 12:22 AM

PhonePe 200 Crore Transactions

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: డిజిటల్ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలు భారీగా పుంజుకుంటున్నాయి. ఈ విభాగ సేవలు అందిస్తున్న ఫోన్‌పే కూడా ఇప్పటి వరకు 200 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ప్రకటించింది. ప్రతియేటా కంపెనీ ప్లాట్‌ఫామ్ కింద 70 బిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరిగినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ చేతిలో 30 లక్షల మంది మర్చెంట్లు, ప్రతి నెల లావాదేవీలు జరిపేవారు 5 కోట్ల మంది ఉండగా, ఈ సేవలు ప్రారంభించిన అతి కొద్ది కాలంలో 200 కోట్ల లావాదేవీలను పూర్తి చేసినట్లు ఫోన్‌పే వైస్-ప్రెసిడెంట్ కార్థిక్ రఘుపతి తెలిపారు. కంపెనీ యాప్ ద్వారా జరిపే లావాదేవీల్లో 75 శాతం ద్వి, తృతీయ శ్రేణి నగరాల నుంచి జరుగుతుండటం విశేషమన్నారు. నవంబర్ 2018లో 100 కోట్ల లావాదేవీలు దాటిన సంస్థ..మరో వంద కోట్లకు చేరుకోవడానికి కేవలం ఐదు నెలలు మాత్రమే పట్టింది. ప్రస్తుతం బోర్డులో 30 లక్షల మంది ఉండగా, వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles