డ్యూయల్ సిమ్ ఐఫోన్లు

Thu,September 13, 2018 01:03 AM

Phone XS iPhone XS Max iPhone XR Launched, Dual SIM Functionality Announced

-మూడు రకాల మోడళ్లను ఆవిష్కరించిన యాపిల్
కాలిఫోర్నియా, సెప్టెంబర్ 12: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు నూతన స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. కూపర్‌టినో వేదికగా డ్యూయల్ సిమ్ కలిగిన ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్‌ఎస్ మ్యాక్స్, ఎక్స్‌ఆర్ రకాల ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ఎస్‌లో 5.8 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎక్స్‌ఎస్ మ్యాక్స్‌లో 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎక్స్‌ఆర్‌లో 6.1 టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ధరల విషయానికి వస్తే 64జీబీ, 128 జీబీ, 256 జీబీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్లు 749 డాలర్ల నుంచి 1,099 డాలర్ల వరకు ఈ ఫోన్లు లభించనున్నాయి. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, ముందుభాగంలో 7 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ధర కలిగిన ఐదు రంగుల్లో లభించనున్న ఎక్స్‌ఆర్‌లో 6.1 అంగుళాల తాకేతెర, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, స్టీరియో సౌండర్, బయోమెట్రిక్ ద్వారా ముఖాన్ని గుర్తించే సదుపాయం ఈ ఫోన్లో ఉంది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టీమ్ కుక్ మాట్లాడుతూ..ప్రపంచ స్మార్ట్‌ఫోన్ దశదిశను ఈ ఫోన్లు మార్చివేయనున్నదన్నారు.
AFP
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో తన తొలిస్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం ఉందన్నారు. గత వాటితో పోలిస్తే 30 శాతం అత్యంత వేగవంతంగా పనిచేయనున్నది. ఇకనుంచి పునరుత్పాదక విద్యుత్‌తో నడిచే ఫోన్లు అని ఆయన పేర్కొన్నారు.
I-phone

4 సిరీస్‌లో నూతన వాచ్‌లు

వీటితోపాటు 4 సిరీస్‌లో అతిపెద్ద స్క్రీన్ కలిగిన వాచ్‌లను కూడా ప్రవేశపెట్టింది. సంస్థ. భావితరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ వాచ్ ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి సమయానికి తగ్గట్టుగా సెట్ చేసుకోనున్నది. అతిపెద్ద స్క్రీన్, డ్యూయల్ కోర్ 64 బిట్ ప్రాసెసర్, గుండెకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి వీలుగా దీంట్లో ప్రత్యేక యాప్‌ను పొందుపరిచింది. 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉండనున్నది. మూడు రకాల్లో లభించనున్న ఈ వాచ్‌ను 399 డాలర్లు, 499 డాలర్లుగా నిర్ణయించింది.

4630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles