మళ్లీ పెట్రో మంట

Mon,November 11, 2019 03:43 AM

- 20 పైసలు పెరిగిన లీటర్‌ ధర


న్యూఢిల్లీ, నవంబర్‌ 10: సామాన్యుడిపై మళ్లీ పెట్రోల్‌ పిడుగు పడింది. గత కొన్ని రోజులుగా ధరలపై ఊరట కల్పించిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు ఈసారి భారీగా వడ్డించాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధరను 20 పైసలు పెంచింది ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ). దీంతో ఢిల్లీలో లీటర్‌ ధర రూ.73.05కి చేరుకున్నది. గడిచిన మూడు రోజుల్లోనే లీటర్‌ ధర ఏకంగా 45 పైసలు ఎగబాకినట్లు అయింది. పెట్రోల్‌ ధరలు పెంచిన ఇంధన సంస్థలు డీజిల్‌ను మాత్రం యథాతథంగా ఉంచాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.65.91 వద్ద స్థిరంగా ఉన్నది. ఆయా రాష్ర్టాలు విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరల్లో పెరుగుదల ఎక్కువగా ఉండనున్నది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 21 పైసలు అందుకొని రూ.77.74కి చేరుకున్నది. గత మూడు రోజుల్లో 48 పైసలు పెరిగింది. కానీ, డీజిల్‌ రూ.71.93 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు అధికమవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో ధరలు పెంచుతున్నాయి ఇంధన సంస్థలు.

453
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles