పెరుగుతున్న పెట్రో భారం

Sun,January 13, 2019 12:16 AM

Petrol and diesel prices increased

లీటర్ పెట్రోల్‌పై 20 పైసలు,డీజిల్‌పై 32 పైసల వడ్డన
హైదరాబాద్: పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తిరిగి విజృంభిస్తుండటంతో.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడుతున్నది. ఈ క్రమంలోనే శనివారం లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో 20 పైసలు ఎగిసి రూ.73.47ను చేరింది. డీజిల్ ధర కూడా 32 పైసలు ఎగబాకి రూ.68.60ను తాకింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు అందుకుని రూ.69.26 వద్దకు, డీజిల్ 29 పైసలు అందిపుచ్చుకుని రూ.63.10 వద్దకు చేరాయి. ఇక గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 80 పైసలు, డీజిల్ 94 పైసలు చొప్పున పెరిగాయి.
petrol-diesel-reuters

3333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles