30దాకా మూసివేతే..

Thu,May 16, 2019 02:16 AM

Pak airspace to remain shut for Indian flights till May 30

-పాక్ గగన తలంపై భారత విమానాలకు
-కొనసాగనున్న ఆంక్షలు
లాహోర్, మే 15: అసలే సంక్షోభంలో ఉన్న భారత విమానయాన రంగానికి పాకిస్తాన్ సెగ తగులుతున్నది. ఈ నెల 30దాకా భారత విమానాలకు తమ గగన తలంలో ప్రవేశం లేదని బుధవారం పాక్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ, విమానయాన మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఈ నెల 15వరకే అన్న పాక్.. ఇప్పుడు దాన్ని మరో 15 రోజులు పెంచింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే వీలుందని సమాచారం. కాగా, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత్ చేసిన బాలాకోట్ వైమానిక దాడులు.. పాక్ గగన తలంపై ఆంక్షల్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో అన్ని దేశాల విమాన సర్వీసుల ప్రవేశానికి అడ్డు చెప్పిన పాక్.. మార్చి 27న భారత్ మినహా పలు దేశాల సర్వీసులకు దారిచ్చింది. దీంతో భారతీయ విమాన సర్వీసులకే బ్రేక్ పడింది. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కూ నష్టం వాటిల్లుతున్నది. బ్యాంకాక్, కౌలాలంపూర్, న్యూఢిల్లీ విమానాలు రద్దయ్యాయి.

కాగా, అంతర్జాతీయ మార్గాల్లో పాకిస్తాన్ గగన తలం అత్యంత కీలకం కావడంతో దాయాది నిర్ణయం.. దేశీయ ఎయిర్‌లైన్స్ లాభాలను ఆవిరి చేస్తున్నది. భారత్ నుంచి చాలా దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దీంతో ఇంధన వినియోగం పెరిగిపోతున్నది. ఏప్రిల్‌లో కిలో లీటర్ ఖర్చు 668 డాలర్లుగా ఉంటే.. ఈ నెల 700 డాలర్లకు పెరిగింది. ఫలితంగా రోజూ దాదాపు 400 విమానాలపై ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే ఇరాన్ గగన తలంపై రద్దీ పెరిగింది. ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని విమానయాన సంస్థలు వాడుకుంటుండగా, 100కుపైగా విమానాల రాకపోకలు పెరిగాయి. అయితే 451 కిలోమీటర్ల దూరం కూడా పెరిగింది. దీంతో చాలా విమాన సర్వీసులు రైద్దెపోయాయి. తప్పని పరిస్థితుల్లో ఒమన్ తదితర అరబ్ దేశాల మార్గాలను విమానయాన సంస్థలు వాడుకుంటున్నాయి. అయితే వ్యయభారం మాత్రం భరించలేకుండా ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై పాక్ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles