వీ-హబ్‌తో పీ అండ్ జీ జట్టు

Wed,August 14, 2019 12:06 AM

P And G partners with WE Hub for start ups to pilot ideas

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వీహబ్ గుర్తించిన మూడు స్టార్టప్‌లను ప్రపంచ ప్రఖ్యాత ఎఫ్‌ఎంసీజీ సంస్థ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) తమ వీగ్రో పథకానికి ఎంపిక చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 55 స్టార్టప్‌లు వీహబ్ ద్వారా వీగ్రో పథకానికి దరఖాస్తు చేయగా.. వాటిలో మూడింటిని మంగళవారం ముగిసిన సదస్సులో ఎంపిక చేశారు. డిజిటలైజేషన్, సమర్థ ఇంధన వినియోగ విభాగాల్లో ఎంపికైన ఈ మూడు స్టార్టప్‌లు హైదరాబాద్‌లోని పీ అండ్ జీ ప్లాంట్‌లో తమ ఆలోచనలకు రూపమివ్వనున్నాయి. పీ అండ్ జీ ప్రోత్సాహంతో ఈ మూడు స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలకు ఉత్తమ రూపమివ్వగలవని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. వీహబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా అనేకమంది సృజనాత్మక ఆలోచనలతో తమకు చేరువయ్యారని పీ అండ్ జీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ శివాంగిజైన్ పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో మహిళల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు పీ అండ్ జీ భాగస్వామ్యంతో మరింత మెరుగైన అవకాశాలు లభించాయని వీహబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు.

185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles