దావోస్‌కు 100 మంది భారత సీఈవోలు

Mon,November 11, 2019 04:03 AM

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా..
జనవరి 20 నుంచి డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు

న్యూఢిల్లీ, నవంబర్ 10: దావోస్ కేంద్రస్థానంగా ప్రతియేటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు ఈసారి భారత్ తరఫున వంద మంది సీఈవోలు హాజరవుతున్నారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 20 నుంచి ఐదు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన, సంపన్న వర్గాలు, గ్లోబల్ లీడర్లు హాజరకానున్నారు. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌లు సహా హాజరయ్యే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన సమావేశాలకు వీరిద్దరు గైర్హాజరయ్యారు. సమైక్యం-సుస్తిర నినాదం-2020తో జరుగుతున్న ఈ సమావేశాలకు 3 వేల మంది అంతర్జాతీయ లీడర్లు పాల్గొనే అవకాశాలున్నాయి.

భారత్ తరఫున వంద మంది సీఈవోలతోపాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, షారుక్ ఖాన్, కరన్ జోహర్‌లు కూడా హాజరుకాబోతున్నారు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాల్లో డెల్ నుంచి మైకెల్ డెల్, జేపీ మోర్గాన్ నుంచి జెమ్స్ డిమాన్, డెలాయిట్ నుంచి పునిట్ రంజెన్, ఐబీఎం చీఫ్ గిన్ని రోమెట్టి, ఫేస్‌బుక్ నుంచి షెర్లి స్యాండ్‌బర్గ్, నోకియా నుంచి రాజీవ సూరి, యూబీఎస్ నుంచి యాక్సెల్ వెబర్‌లు కూడా పాల్గొంటున్నారు.
11

338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles