ఓబీసీ వడ్డీరేట్ల తగ్గింపు

Thu,July 11, 2019 02:15 AM

Oriental Bank of Commerce cuts MCLR by up to 10 bps

10 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 10: ప్రభుత్వరంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)..రుణాలను మరింత త క్కువ వడ్డీరేటుకు అందించే ఉద్దేశంలో భాగంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. గురువారం నుంచి అమలులోకి వచ్చేలా ఒకరోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 8.20 శాతానికి, 8.25 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఇవి వరుసగా 8.30 శాతంగాను, 8.35 శాతంగా ఉన్నాయి. వీటితోపాటు మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును కూడా 5 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో 8.45 శాతానికి, 8.55 శాతానికి, 8.65 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ప్రస్తుత సంవత్సరంలో మూడు దశల్లో 75 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు వినియోగదారులకు చేరవేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకులు వరుసగా రేట్లను తగ్గిస్తున్నాయి. ఇదివరకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.

బీఎస్‌ఎన్‌ఎల్ఫ్యాన్సీ నంబర్ల వేలం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఎస్‌ఎన్‌ఎల్ 69వ విడత ఫ్యాన్సీ నంబర్ల ఈ-వేలాన్ని ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్స్ నంబర్స్‌ను పూర్తిగా వెబ్ బేస్‌డ్ పద్ధతిలో కేటాయించనున్నారు. పూర్తి వివరాల కోసం eauction. bsnl.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నంబర్లను ఎంచుకుని బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. అనంతరం ఫ్యాన్సీ నంబర్లను బిడ్డింగ్‌లో గెలుపొందిన వారికి కేటాయించనున్నారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles