విస్తరణ బాటలో ఓరియంట్ సిమెంట్

Tue,February 12, 2019 01:52 AM

Orient Cement plans to invest Rs3,600 crore to expand capacity

-దేవాపూర్‌లో నాలుగో ప్లాంట్ దిశగా అడుగులు
-నేడు అటవీ భూములకు సంబంధించి గ్రామ సభలు

కాసిపేట రూరల్: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లోగల ఓరియంట్ సిమెంట్ కంపెనీ.. తమ నాలుగో ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే వీలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. దీంతో సంస్థ యాజమాన్యం నాలుగో ప్లాంట్ కోసం శరవేగంగా అడుగులు వేస్తున్నది. దేవాపూర్, గట్రావ్‌పల్లి, మద్దిమాడ గ్రామాల పరిధిలోని సున్నపు రాయి నిల్వలున్న అటవీ భూములకు సంబంధించి గ్రామ సభలకు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ.. బిర్లా సిమెంట్ గ్రూప్‌తో కలిసి 1981లో మొదటి యూనిట్ ప్రారంభం ద్వారా సిమెంట్ తయారీలో అగ్రగామిగా నిలిచింది. అధిక ఉత్పత్తి, లాభాలతో ముందుకు వెళ్తూ ఒకటి నుంచి మూడు ప్లాంట్‌లను విస్తరించింది. స్వయంగా 50 మెగావాట్ల పవర్ ప్లాంట్‌నూ నడిపిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే నాలుగో ప్లాంట్ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నది. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మద్దిమాడ, దేవాపూర్ గ్రామాలకు సంబంధించి దేవాపూర్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు, గట్రావ్‌పల్లికి సంబంధించి గట్రావ్‌పల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నారు. మరోవైపు ఈ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో 313.26 హెక్టర్లకు సంబంధించిన భూమిలో గిరిజనులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం 2006 ప్రకారం సాగు చేస్తున్నారా? అన్నది ఆరా తీస్తున్నారు.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles