ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లోలు

Sat,November 9, 2019 12:50 AM

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నా యి. కర్ణాటకలోని ఆల్మట్టితోపాటు నారాయణపుర డ్యాంలకు వరద ప్రవాహం వస్తుండటం తో దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. శుక్రవారం ఆల్మట్టికి 21,548 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతేస్థాయిలో అవుట్‌ఫ్లో నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు 70వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 74 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.


జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలకు ప్రస్తు తం 9.624 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాంకు ఇన్‌ఫ్లో 37,600 క్యూసెక్కులు రాగా, విద్యుదుత్పత్తి ద్వారా 42 వేల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలకు ప్రస్తుతం 214.7889 టీఎంసీలున్నది. నాగార్జునసాగర్‌కు 22,142 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టులో ప్రస్తుతం 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 22,142 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 10,320 క్యూసెక్కుల వరద వస్తున్నది. లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు 78వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 80 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం బరాజ్‌లో 92.70 మీటర్ల ఎత్తులో 2.098 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.

128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles