ఓఐఎల్‌కు 12 చమురు బావులు!

Mon,June 10, 2019 02:20 AM

ONGC Vedanta set to win 9 oil gas blocks each Reliance  BP one OIL 12

-ఓఎన్‌జీసీ, వేదాంతకు చెరో తొమ్మిది
న్యూఢిల్లీ, జూన్ 9: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ), మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌లు చెరో తొమ్మిది చమురు, గ్యాస్ బావులను దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. 32 బావుల కోసం తాజాగా నిర్వహించిన వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్-బీపీలు ఒక్క బావిని చేజిక్కించుకోగా, మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)కు 12 బావులు లభించాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఓఎన్‌జీసీ, వేదాంతా, ఆయిల్ ఇండియాలు లిమిటెడ్‌లు టాప్ బిడ్డర్లుగా నిలిచాయి.

రిలయన్స్-బీపీ సంయుక్తంగా బంగాళాఖాతంలోని కృష్ణ గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన చమురు బావిని దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. వేలంలో బావులను దక్కించుకున్న కంపెనీల పూర్తి వివరాలు తెలియాలంటే మరో కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) అనుమతించిన తర్వాతనే ఈ జాబితా బయటకు పొక్కనున్నది. ఓపెన్ అరెంజ్ లైసెన్సింగ్ పాలసీ(ఓఏఎల్‌పీ) రౌండ్-2లో భాగంగా 14 బ్లాక్‌లను వేలం వేయగా, మరో 18 చమురు-గ్యాస్ బ్లాకులు, ఐదు కోల్-బెడ్ మిథైన్ బ్లాక్‌ల వేలం మే 15న ముగిసింది. ఎనిమిదేండ్ల తర్వాత రిలయన్స్-బీపీ తొలి చమురు బావిని దక్కించుకున్నట్లయిందని ఆ వర్గాలు వెల్లడించా యి. 2013లో కేజీ-డీ6 చమురు బావులలో నీరు, ఇసుక అధికంగా చేరడంతో సగానికి పైగా బావుల్లో ఉత్పత్తిని నిలిపివేసింది.

1029
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles