ఆయిల్ ఇండియా 1,527 కోట్ల షేర్ల బైబ్యాక్

Tue,March 21, 2017 12:17 AM

న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో రెండో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్..రూ.1,527 కోట్ల విలువైన 4.49 కోట్ల షేర్లను బైబ్యాక్(తిరిగి కొనుగోలు) చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ అంచనాకు చేరుకోవడానికి ఇప్పటికే పలు పీఎస్‌యూలు బైబ్యాక్‌ను ప్రకటించాయి. తాజాగా ఇదే జాబితాలోకి ఆయిల్ ఇండియా చేరింది. ఆయిల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 66.89 శాతం వాటా కలిగివుంది. ఈ బైబ్యాక్ ప్రతిపాదనకు సోమవారం సమావేశమైన కంపెనీ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఒక్కో షేరుకు రూ.340 చొప్పున 4.49 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ.334 వద్ద స్థిరపడింది.

369

More News

మరిన్ని వార్తలు...