ఎయిర్ ఇండియాకు గట్టి షాక్

Fri,August 23, 2019 12:08 AM

Oil companies stop fuel supply to Air India in six airports

-చమురు సరఫరాను నిలిపివేసిన కంపెనీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం మధ్యాహ్నం నుంచి దేశీయంగా ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీఎస్) ప్రకటించాయి. పాత బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఇంధన సరఫరాను నిలిపివేసినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయని, వీటిపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించింది. గురువారం సాయం త్రం 4 గంటల నుంచి కొచ్చి, విశాఖపట్నం, మొహాలీ, రాంచీ, పుణె, పాట్నా విమానాశ్రయాల్లో ఇంధన సరఫరా నిలిపివేశాయి కంపెనీలు. రుణాలు పెరిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థను వెంటనే కేంద్రం ఆదుకోవాలని, కంపెనీ ఆర్థిక స్థితిగతులు, పనితీరు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

357
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles