ఐఎస్‌బీ విద్యార్థులు భళా..!

Wed,December 4, 2019 12:44 AM

-1383 మంది విద్యార్థులకు ఆఫర్లు

హైదరాబాద్, డిసెంబర్ 3: నైపుణ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో చదువుకున్నవారిని ఎగరేసుకొని పోతున్నాయి దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు. 2020 సంవత్సరానికిగాను ఐఎస్‌బీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన వారిలో 1,383 మంది విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్ ఇచ్చాయి కార్పొరేట్ సంస్థలు. అంతక్రితం ఏడాది 1,194 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. గరిష్ఠ వార్షిక వేతనంగా రూ.26.15 లక్షలు ఆఫర్ చేశాయి. గతేడాది ఆఫర్ చేసిన దాంతో పోలిస్తే 124 శాతం అధికం. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నాయకుడిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐఎస్‌బీ కృషి చేస్తున్నదని, ఇప్పటికే ఎంతో మంది నైపుణ్యం కలిగిన విద్యార్థులను చేజిక్కించుకోవడానికి దేశీయ కంపెనీలు ఐఎస్‌బీనే ఎంచుకుంటున్నట్లు చెప్పారు. 890 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుండే అతిపెద్ద క్లాస్‌ను ఇటీవల ఏర్పాటు చేసింది.

ఏయే రంగాలు

కన్సల్టింగ్, ఐటీ/ఐటీఈఎస్/ టెక్నాలజీ, ఈ-కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ/రిటైల్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు.

పాల్గొన్న కంపెనీలు

యాక్సెంచర్, అల్వారెజ్ అండ్ మార్సల్, ఏటీ కిర్నే, బెయిన్ అండ్ కంపెనీ, మికెన్సీ, పీడబ్ల్యూసీ డీఐఏసీ, పీడబ్ల్యూసీ ఇండియా, రోలాండ్ బర్గర్, సిమెన్స్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ అండ్ జెడ్‌ఎస్‌లతోపాటు 314 సంస్థలు పాల్గొన్నాయి.

ఐటీ/ఐటీఈఎస్, టెక్నాలజీకి చెందినవి

ఏడీపీ, అమెజాన్, బ్లాక్‌బక్, బైజుస్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, ఇన్‌మోబి, మీడియా. నెట్ సాఫ్ట్‌వేర్ సర్వీసులు, ఎంఫిన్, మైక్రోసాఫ్ట్, మింత్రా, నాగార్రో సాఫ్ట్‌వేర్, నైకా, ఓలా, పేసేఫ్, ఫోన్‌పే, రాజోర్‌పే, థఫ్‌వర్క్స్, ఉడాన్, ఉబర్, వీఎంవేర్, జోమాటోలు ఉన్నాయి.

బీఎఫ్‌ఎస్‌ఐ విభాగానికి చెందిన కంపెనీలు

యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, క్రెడిట్ స్యూస్, ఎస్టీ అడ్వైజర్, ఐసీఐసీఐ బ్యాంక్, మాట్రిక్స్ పార్టనర్స్, యెస్ బ్యాంక్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బార్‌క్లేస్, కింగ్‌ఫిష్ ప్రైవేట్ ఈక్విటీ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(జీవోఐ), ఆర్‌బీఎస్, వాటర్‌ఫిల్డ్ అడ్వైజర్స్, వెల్స్ ఫార్గోలు ఉన్నాయి.

ఎఫ్‌ఎంసీజీ/మార్కెటింగ్ కంపెనీలు

ఏబీ ఇన్‌బెవ్, కోక-కోలా, కాల్గెట్, పాల్మోలివ్, గోద్రేజ్, హెచ్‌యూఎల్, నెస్లే, పీ అండ్ జీ, సామ్‌సంగ్, ఐటీసీ, మారికోలు దేశీయ సంస్థల కంటే అంతర్జాతీయ సంస్థల్లో చేరడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. వీటిలో యాపిల్, డెలాయిట్, ఈవై, ల్యాండ్‌మార్క్‌లు ఉన్నాయి.

226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles