ఆపేయండి: శాట్

Wed,December 4, 2019 12:26 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంకుల వద్ద కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) తాకట్టు పెట్టిన క్లయింట్ల సెక్యూరిటీల తరలింపును సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) ఆపేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈ సెక్యూరిటీలను మదుపరుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్)కు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 83 వేల క్లయింట్ల సెక్యూరిటీలు ఇప్పటికే వారివారి ఖాతాల్లోకి వచ్చేశాయి. రూ.2,300 కోట్ల విలువైన 95 వేలకుపైగా క్లయింట్ల సెక్యూరిటీలను నిబంధనలకు విరుద్ధంగా కార్వీ తమ సొంత ఖాతాలోకి తరలించిన సంగతి విదితమే. అనంతరం వాటిని బ్యాంకులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల వద్ద తనఖా పెట్టి వ్యక్తిగత, సంస్థాగత అవసరాల కోసం రూ.600 కోట్ల రుణాలను పొందినదీ తెలిసిందే.

160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles