శాఖల విస్తరణను తగ్గించం..

Tue,February 19, 2019 12:29 AM

No plans to cut down branch expansion by HDFC Bank chief

స్పష్టంచేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్
ముంబై, ఫిబ్రవరి 18: దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణను తగ్గించే అవకాశాలు లేవని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా అత్యధిక బ్యాంకులు టెక్నాలజీ ద్వారా సేవలు అందించడానికి మొగ్గుచూపుతున్నాయని, ముఖ్యం గా శాఖకు రాకుండానే సేవలు అందించే విధంగా టెక్నాలజీ పరంగా మార్పులు తీసుకోస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవో ఆదిత్యా పూరి మాట్లాడుతూ..బ్యాంకుల విస్తరణ కార్యకాలపాలు భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పారు. కానీ, ఖాతాదారుడికి బ్యాంకింగ్ సేవలను మొబైల్ ఫోన్ ద్వారా గానీ, ల్యాప్‌టాప్, శాఖల ద్వారా అందిస్తామని తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక వేగంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌లో ఇంకా చాలా మందికి బ్యాంకింగ్ సేవలు అందడం లేదని ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలో లక్ష గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఎప్పటిలోగా, ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై ఆయన మాత్రం స్పష్టతనివ్వలేదు. అంతర్జాతీయ సంస్థలైన హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్‌లు దేశీయంగా శాఖలను మూసివేయడంతో 500మంది ఉ ద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. బ్యా ంకింగ్ రంగ కార్యకలాపాలు ప్రారంభించిన 25ఏండ్లు పూర్తైన సందర్భంగా ఆయన ముం బైలోని అంధేరీ వద్ద బ్యాంక్‌కుచెందిన 5000 వ శాఖను సోమవారం ప్రారంభించారు.

707
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles