మెట్రోపాలిటన్‌ మ్యూజియం బోర్డులోకి నీతా అంబానీ

Thu,November 14, 2019 12:27 AM

న్యూయార్క్‌, నవంబర్‌ 13: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ బోర్డుకు ఆమెకు ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకుగాను ఆమెకు ఈ గౌరవం లభించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నీతా అంబానీని గౌర ధర్మకర్తగా ఎన్నుకున్నట్లు మ్యూజియం చైర్మన్‌ డేనియల్‌ బ్రాడ్‌స్కీ ప్రకటించారు. 56 ఏండ్ల వయస్సు కలిగిన నీతా అంబానీ..భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, కళలను ప్రపంచవ్యాప్తంగా ఆమె చూపిస్తున్న ఆదరణ చూసి ఈ చారిత్రక మ్యూజియం బోర్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. 149 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియానికి తొలి భారతీయ వ్యక్తి నీతానే కావడం విశేషం. సామాజిక సేవల్లోభాగంగా నీతా అంబానీ 2016లో ఏర్పాటు చేసిన రిలయన్స్‌ పౌండేషన్‌..ఈ చారిత్రక మ్యూజియానికి మద్దతు ఇస్తున్నది.

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles