నిస్సాన్ సన్నీపై 2 లక్షల తగ్గింపు


Fri,April 21, 2017 12:27 AM

nissan-sunny
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్.. మధ్యస్థాయి సెడాన్ సన్నీ ధరను రూ.1.99 లక్షల వరకు తగ్గించింది. ప్రాంతీయంగా తయారుచేయడం వల్లనే ధరను తగ్గించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ షోరూంలో సన్నీ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.8.99 లక్షల వరకు తగ్గింది. నూతన ధరల ప్రకారం సన్నీ పెట్రోల్ రకం రూ.1.01 లక్షలు తగ్గి రూ.6.99 లక్షలకు చేరుకోగా, టాప్-ఎండ్ ఆటోమేషన్ ట్రాన్స్‌మిషన్ రకం రూ.1.99 లక్షలు తగ్గి రూ.8.99 లక్షలకు చేరుకుంది. డీజిల్ రకం రూ.1.31 లక్షలు కోత పెట్టడంతో రూ.7.48 లక్షలకు చేరుకున్నది. టాప్ ఎండ్ మోడల్ రూ.94 వేలు తగ్గడంతో రూ.8.99 లక్షలకు చేరుకుంది. ప్రాంతీయంగా కారును తయారు చేయడం వల్లనే ధరను తగ్గించాల్సి వచ్చిందని ఎన్‌ఎంఐపీఎల్ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. గడిచిన సంవత్సరంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మైక్రా కారు ధరను రూ.54,252 తగ్గించిన విషయం తెలిసిందే.

288

More News

VIRAL NEWS