11న పారిశ్రామిక వర్గాలతో నిర్మలా భేటీ

Sat,June 8, 2019 12:51 AM

Nirmala to meet industry chambers on Jun 11 for Pre Budget Consultation

న్యూఢిల్లీ, జూన్ 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై కసరత్తు వేగంగా జరుగుతున్నది. ఈ బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్..ఈ నెల 11న దేశీయ వ్యాపార వర్గాల సమూహాలతో సమావేశంకాబోతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఫిక్కీ, అసోచామ్‌లతోపాటు ఇతర వ్యాపార వర్గాలు హాజరవనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలు ఇండస్ట్రీ వర్గాలు తమ డిమాండ్లతో కూడిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదించాయి కూడా. వచ్చే నెల 5న నిర్మలా సీతారామన్ లోకసభలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎఫ్‌డీఐలను ఆకట్టుకోవడంతోపాటు టూరిజం రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరిలోనే మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం..మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.

బడ్జెట్‌పై సూచనలు ఇవ్వండి..ప్రజలను కోరిన కేంద్ర ప్రభుత్వం


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో సామాన్యులను సైతం పాలుపంచుకునేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 20లోగా ఈ బడ్జెట్‌పై ప్రజలు సూచనలు చేయవచ్చునని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన mygov.in అనే పోర్టల్‌కు తమ అభిప్రాయాలను పంపవచ్చునని సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ తన తొలి వార్షిక బడ్జెట్‌ను వచ్చే నెల 5న లోకసభలో ప్రవేశపెట్టబోతున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ లో సామాన్యులు పా లుపంచుకుంటున్న విష యం తెలిసిందే. వచ్చే నె ల 4న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం..ఆ మరుసటి రోజే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles