పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం

Sun,June 9, 2019 12:03 AM

Nirmala Sitharaman highlights India efforts to counter tax avoidance

-జీ-20 సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ/ఫుకువోక, జూన్ 8: పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్‌లో జరుగుతున్న జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రారంభ రోజైన శనివారం పన్ను ఎగవేతల నిరోధానికి భారత్ చేస్తున్న కృషిని సభ్య దేశాల మంత్రులకు ఆమె వివరించారు. అంతర్జాతీయ పన్నుల విధానం, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థలపై జరిగిన మంత్రుల సమ్మేళనంలో మాట్లాడుతూ పన్నుల నుంచి తప్పించుకోవాలని, వాటిని ఎగవేయాలని చూసేవారిపట్ల భారత్ అవలంభిస్తున్న కఠిన వైఖరిని, వారిలో మార్పు తెచ్చేందుకు ఆచరిస్తున్న విధానాలను తెలిపారు. వృద్ధిరేటు పురోగతికి పన్నుల సంస్కరణలు దోహదపడగలవని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. డిజిటల్ ట్యాక్స్‌ను వేగవంతం చేయాలని కూడా జీ-20 ఓ నిర్ణయానికొచ్చింది. ఇదిలావుంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాల సందర్భంగా చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు యోచిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నూచిన్ చెప్పారు. మెక్సికోతో చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించాలని చైనాను అమెరికా కోరుతున్నది.

692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles