విచారణకు సహకరిస్తాం: జీజేఈపీసీ

Sun,February 18, 2018 01:00 AM

Nirav Modi Gitanjali scam not to affect gems & jewellery exports: GJEPC

GJEPC
పీఎన్‌బీలో జరిగిన ఈ భారీ కుంభకోణాన్ని ఖండిస్తున్నట్లు జెమ్ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. ఈ స్కాం ఇండస్ట్రీ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకుంటున్నానని జీజేఈపీసీ చైర్మన్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న పలు ఏజెన్సీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ స్కాంలో ప్రధాన నింధితులైన నీరవ్ మోదీ, చోక్సీలు సభ్యులుగా ఉండటం విశేషం. ఈ కేసుకు సంబంధించి విచారణను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు, వీరిద్దరిపై సరైన సమయంలో తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పీటీఐకి తెలిపారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS