Telangana Intermediate 1st & 2nd Year Results 2019

నీరవ్ మోదీ అరెస్ట్

Thu,March 21, 2019 02:15 AM

Nirav Modi arrested in London on India extradition request denied bail

-లండన్‌లో పట్టుకున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు
-పీఎన్‌బీ కుంభకోణం కేసులో గొప్ప పురోగతి
-బ్యాంక్ క్లర్క్ సమాచారంతో చిక్కిన మోసగాడు
-బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు.. 29దాకా రిమాండ్
లండన్, మార్చి 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకైన పీఎన్‌బీని మేనమామ మెహుల్ చోక్సీతో కలిసి రూ.13,500 కోట్లు ముంచిన ఈ వజ్రాల వ్యాపారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో ఈ కేసులో భారత్ గొప్ప పురోగతిని సాధించినైట్లెంది. దేశీయ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా పేర్కొంటున్న పీఎన్‌బీ స్కాం.. పెను సంచలనాల్నే సృష్టించింది. దీని విచారణను సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలూ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. కాగా, భారతీయ దర్యాప్తు ఏజెన్సీల అభ్యర్థనపై వారి తరఫున లండన్ నగరంలోని హాల్బర్న్‌లో 48 ఏండ్ల నీరవ్ దీపక్ మోదీని పట్టుకున్నాం అని ఓ ప్రకటనలో మెట్రోపాలిటన్ పోలీసులు స్పష్టం చేశారు.

సమాచారమిచ్చిన బ్యాంక్ క్లర్క్

ఓ మెట్రో బ్యాంక్ శాఖలో కొత్త ఖాతా తెరిచేందుకు నీరవ్ వచ్చినట్లు చెబుతున్న పోలీసులు.. ఆ బ్యాంక్‌లోని క్లర్క్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పీఎన్‌బీ కేసు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరిగిన నేపథ్యంలో దానిపై అవగాహన ఉన్న సదరు క్లర్క్ నీరవ్ సమాచారం అందించారు. కాగా, ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లండన్‌లో ఉన్న నీరవ్ మోదీని అప్పగించాలంటూ బ్రిటన్ హోం శాఖకు విజ్ఞప్తి చేసింది.

దీన్ని ఈ నెలారంభంలో అక్కడి హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ధ్రువీకరించడంతో వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇటీవలే అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేసిన సంగతీ విదితమే. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే నీరవ్‌ను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. పీఎన్‌బీ మోసం వెలుగు చూడటానికి ముందే గతేడాది జనవరిలో నీరవ్, చోక్సీలు కుటుంబ సభ్యులతోసహా దేశం విడిచి పారిపోయినది తెలిసిందే. ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీహౌజ్ శాఖ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్ (ఎల్‌వోయూ), లెటర్ ఆఫ్ కంఫర్ట్‌లపై నీరవ్, చోక్సీ సంస్థలు వేల కోట్ల మోసానికి తెగబడ్డాయి.

బెయిల్ తిరస్కరణ.. 29దాకా కస్టడి

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జీ మ్యారీ మల్లోన్ ఎదుట పోలీసులు బుధవారం నీరవ్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నీరవ్ బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీలో రిమాండ్‌కు ఆదేశించింది. భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్).. నీరవ్ చేసిన మోసానికి బ్రిటన్ చట్టాల ప్రకారం కనీసం ఏడేండ్ల జైలు శిక్ష పడుతుందని, జీవిత ఖైదు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని కోర్టులో వాదించింది. ఈ క్రమంలోనే నీరవ్‌కు బెయిల్ ఇవ్వరాదని కోరింది.

మూడు పాస్‌పోర్టులు స్వాధీనం

నిరుడు జనవరిలో నీరవ్ లండన్‌కు వచ్చాడని, తన పాస్‌పోర్టునూ భారత ప్రభుత్వం ఆ సమయంలోనే రద్దు చేసిందని, ఇతర దేశాలకు చెందిన పాస్‌పోర్టులపై తిరుగుతున్నాడని కోర్టుకు సీపీఎస్ వివరించింది. మొత్తం మూడు పాస్‌పోర్టులున్నాయని, యూఏఈ, సింగపూర్, హాంకాంగ్ దేశాల నివాస గుర్తింపు కార్డులూ ఉన్నాయన్నది. ఈ క్రమంలో బెయిల్ వస్తే మళ్లీ నీరవ్ పారిపోవచ్చన్న అనుమానాలను న్యాయమూర్తి వ్యక్తం చేశారు.

ఇక నీరవ్ తరఫున బారిష్టర్ జార్జ్ హెప్‌బుర్న్, ఆనంద్ దూబేలు వాదిస్తుండగా, దూబే విజయ్ మాల్యా కేసులోనూ వాదిస్తుండటం గమనార్హం. బెయిల్ కోసం 5 లక్షల పౌండ్ల పూచీకత్తును నీరవ్ లాయర్లు ఆఫర్ చేశారు. మరోవైపు విజయ్ మాల్యా కేసు తరహాలోనే ఈ కేసూ తయారవుతుం దా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9, 000 కోట్ల రుణాల ఎగవేత కేసులో మూడేండ్ల క్రితం 2016 మార్చిలో లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి మాల్యా.. 2017 ఏప్రిల్‌లో ఇలాగే అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పొందగా, ఇప్పటివరకు దానిపైనే దర్జాగా తిరిగేస్తున్నాడు. గత నెల భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ఆదేశంపైనా ఉన్నత న్యాయస్థానాల్లో 63 ఏండ్ల మాల్యా అప్పీలు చేసుకుంటున్నదీ విదితమే.

స్వాగతించిన భారత విదేశాంగ శాఖ

నీరవ్ మోదీ అరెస్ట్‌ను భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. భారత్‌కు నీరవ్‌ను త్వరగా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలి పింది. నిరుడు జనవరిలో దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ.. ఏడాదికిపైగా తప్పించుకు తిరుగుతున్నాడు. నీరవ్‌ను పట్టుకునేందుకు సీబీఐ, ఈడీలు తీవ్ర ప్రయత్నాలనే చేయగా, ఇంటర్‌పోల్‌నూ ఆశ్రయించాయి. అయితే ఎప్పట్నుంచో లండన్‌లోనే ఉన్నాడంటున్న దర్యాప్తు సంస్థల అనుమానాలు ఇటీవలే రుజువయ్యాయి. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లోగల సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్‌లో నివాసముంటున్న నీరవ్.. అక్కడే జ్యుయెల్లరీ బొటిక్‌నూ నడిపిస్తున్నాడని తేలిం ది. లండన్ వీధుల్లో ఖరీదైన కోటు వేసుకుని తిరుగుతున్న దృశ్యాలూ బయటకు వచ్చాయి.

జైలులో ప్రత్యేక గది?

ఈ నెల 29దాకా నీరవ్‌కు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో లండన్‌లోని అత్యంత రద్దీగల హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్ కారాగారంలో ఉంచనున్నారు. అక్కడ నీరవ్‌కు ప్రత్యేక సెల్ ను ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

నెలకు రూ.18 లక్షల జీతంతో ఉద్యోగం

ప్రస్తుతం 20 వేల పౌండ్ల (రూ.18 లక్షలు) నెలసరి జీతంతో లండన్‌లోని డైమండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు నీర వ్ కోర్టుకు తెలిపాడు. పన్నులను చెల్లిస్తున్నానని, నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్‌నూ చూ పించారు. అయితే తప్పించుకోవడంలో భాగంగానే, అక్కడి పౌరుడినని చాటుకునేలా నీరవ్ ఇదంతా చేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, తెల్ల షర్టు, ట్రౌజర్స్‌తో నీరవ్ కోర్టులో కనిపించాడు.

నీరవ్ పెయింటింగ్స్, వాహనాల వేలం


painting
నీరవ్ మోదీకి చెందిన 173 పెయింటింగ్స్, 11 వాహనాలను ఈడీ అమ్మేయనున్నది. ఈ మేరకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా లభించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖర్లో వీటిని బహిరంగ వేలం వేయనున్నట్లు చెప్పాయి. పెయింటింగ్స్ రూ.57.72 కోట్ల విలువను కలిగి ఉంటాయని అంచనా. అలాగే స్వాధీ నం చేసుకున్న కార్లలో రోల్స్ రాయిస్, పోర్షే, మెర్సిడెజ్ వంటి లగ్జరీ వాహనాలు, టయో టా ఫార్చ్యునర్ ఉన్నాయి. ఇదిలావుంటే నీరవ్‌పై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ చేస్తున్న దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన 68 పెయిం ట్ల వేలానికీ కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పీఎన్‌బీ కేసులో నీరవ్ భార్య అమీ పా త్రపై అనుమానాలతో ఈడీ చేసిన అభ్యర్థన మేరకు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్‌నూ కోర్టు ఈ సందర్భంగా జారీ చేసింది.
cars

2349
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles