ఆర్థిక గణాంకాలే కీలకం

Mon,November 12, 2018 12:04 AM

Nifty traded in the range between 10480 to 10620

మూరత్ ట్రేడింగ్ మినహా గతవారం కేవలం మూడు రోజులే జరిగిన ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ అరశాతం కన్నా తక్కువ లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 10,480-10,620 మధ్య రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. దీపావళి సందర్భంగా జరిగిన మూరత్ ట్రేడింగ్ లో దాదాపు 80 శాతం షేర్లు లాభాలతో ముగిసాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లతో మార్కెట్‌లో పతనం నిలిచి పోయింది. వరుసగా రెండో వారమూ మార్కెట్ లాభాలతో ముగియడం రెండు నెలల తర్వాత ఇది తొలిసారి. ఆర్థిక ఫలితాలు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. గత వారం క్రూడాయిల్ 70 డాలర్ల దిగువకు పతనం అయింది. అలాగే రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ట్రేడ్ అవుతూ ఉన్నది. ఫారెక్స్ రిజర్వులు మెరుగుపడ్డాయి. అయితే, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లు శుక్రవారం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
NIFTY

ఈవారం ప్రభావితం చేసే అంశాలు

ఆర్థిక గణాంకాలు ఈవారం మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణం వెలువడుతుండగా, బుధవారం టోకు ధర ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. ఈ గణాంకాలపై మార్కెట్ స్పందించే తీరు ఒడిదుడుకులమయంగా ఉండనుంది. కాగా, నిఫ్టీలోని టాటాస్టీల్, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, ఐషర్ మోటార్స్‌లు ఈవారమే ఆర్థిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. వీటికి తోడు డెరివేటివ్ విభాగంలోని అరబిందో ఫార్మా, భారత్ ఫోర్జ్, అపోలో హాస్పిటల్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, బ్రిటానియాలు కూడా ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలకు ముందు, ఆతర్వాత ఈ షేర్లలో కదలికి మార్కెట్ గమనంపై ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధర పతనం కొనసాగుతుందా లేదా చూడాలి. ఇరాన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినందున చమురు మార్కెట్ పరిణామాలు ప్రపంచ మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనుంది. గ్లోబల్ మార్కెట్ల కదలికలు, ట్రేడ్ వార్ పరిణామాలు కూడా ఈ వారం గమనించాలి.

టెక్నికల్స్ : కన్సాలిడేషన్ కొనసాగింపు

మార్కెట్ గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లుగా పెరుగుతూ వస్తున్నా అందులో చివరి ఐదు రోజులు పూర్తిగా సందిగ్దతను సూచించే చిన్న చిన్న క్యాండిల్సే ఏర్పడ్డాయి. నిఫ్టీ స్లోపింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరే గత వారం ముగిసింది. 200 డీఎంఏ 10765 స్థాయిలో వుంది. అలాగే అక్టోబర్ 17న వచ్చిన స్వింగ్ గరిష్ఠ స్థాయి 10,710 వద్ద ఉంది. ఈ రెండు స్థాయిలను అధిగమిస్తేనే మార్కెట్‌లో బుల్లిష్ ధోరణి కొనసాగుతుంది. ఆర్‌ఎస్‌ఐ ఇప్పటికీ న్యూట్రల్ జోన్‌లో వుంది. మ్యాక్ డీ ఇండికేటర్ ఇప్పటికీ జీరోలైన్‌కు దిగువన ఉంది. స్టోకాస్టిక్స్ ఇండికేటర్ ఓవర్ బాట్‌కు చేరుకుంది. దీంతో మార్కెట్‌లో మరికొన్ని రోజులు కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డెరివేటివ్స్ డేటా

డేరివేటివ్స్ గణాంకాలను బట్టి నిఫ్టీకి 10,700 నుంచి 10,800 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురవుతున్నది. ఈ రెండు ైస్ట్రెక్స్‌లో కాల్ ఆప్షన్స్‌లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. 10,000 ఆ తర్వాత 10,200ైస్ట్రెక్స్ పుట్ ఆప్షన్స్‌లో అధిక ఓపెన్ ఇంట్రెస్ట్ వుంది. ఈ రేంజ్‌లోనే మార్కెట్ కదలాడే అవకాశాలున్నాయి. కాగా, ఇండియా విక్స్ 2.58 శాతం పతనం అయి 17.76వద్ద ముగిసింది.

433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles