మారుతి సరికొత్త ఎర్టిగా

Thu,November 22, 2018 12:11 AM

New Maruti Suzuki Ertiga launched in 10 variants, price starts at Rs. 7.44 lakh

న్యూఢిల్లీ, నవంబర్ 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.7.44 లక్షలుగా నిర్ణయించింది. మల్టీ పర్పస్ వాహన విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఈ కారును విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఐదో జనరేషన్‌గా విడుదల చేసిన ఈ కారు పాతదాంతో పోలిస్తే మరింత పొడువుగా, 10 శాతం అదనపు మైలేజీ ఇవ్వనున్నది. పెట్రోల్ రకంలో 1.5 లీటర్ల ఇంజిన్‌తో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, లిథియం ఆయాన్ టెక్నాలజీతో రూపొందించింది. దీంతో పెట్రోల్ రకం రూ.71 వేలు, డీజిల్ రకం రూ.20 వేల వరకు పెరుగుతున్నది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు ధర రూ.7.44 లక్షల నుంచి రూ.9.95 లక్షల మధ్య, 1.3 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన కారు ధర రూ.8.84 లక్షల నుంచి రూ.10.9 లక్షల మధ్య ఉన్నది. హోండా బీఆర్-వీ, మహీంద్రా మరాజోలకు పోటీగా సంస్థ ఈ కారును విడుదల చేసింది.

ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో కెనిచి అయుకవా మాట్లాడుతూ..వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఎర్టిగా నూతన వెర్షన్‌ను తీర్చిదిద్దినట్లు, సరికొత్త కే15 పెట్రోల్ ఇంజిన్‌లో స్మార్ట్ హైబ్రిడ్, లిథియం బ్యాటరీ వెర్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం కస్టమర్‌కు కల్పించినట్లు చెప్పారు. గతదాంతో పోలిస్తే ఈ నూతన వెర్షన్ 10 శాతం అధిక మైలేజ్ ఇవ్వనున్నదని చెప్పారు. ఈ నూతన కారును అభివృద్ధి చేయడానికి సంస్థ రూ.900 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు తెలిపారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన పెట్రోల్ రకం కారు లీటర్‌కు 19.34 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్ 18.69 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నది. అలాగే డీజిల్ వెర్షన్ 25.47 కిలోమీటర్లు ఇవ్వనున్నది. ఏప్రిల్ 2012లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇప్పటి వరకు 4.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles