సరికొత్తగా హోండా డబ్ల్యూఆర్-వీ

Fri,July 12, 2019 02:12 AM

New Honda WRV variant launch at Rs 9.95 L S and VX get feature update

ధర రూ.9.95 లక్షలు
న్యూఢిల్లీ, జూలై 11: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా ఎస్‌యూవీ డబ్ల్యూఆర్-వీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు ధర రూ.9.95 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం లుక్ ఇండే విధంగా డిజైన్ చేసిన ఈ కారును డైటైంలో వచ్చే హెడ్‌ల్యాంప్, రియర్ పార్కింగ్ సెన్సార్, ముందుభాగంలో కూర్చుండే ప్రయాణికుడి కోసం సీట్ బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాజేష్ గోయల్ తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్ 498 పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 12 నుంచి 90 రోజులపాటు అమలులో ఉండనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్లాన్ కింద ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోమింగ్ చార్జీలు ఉచితం, 30 జీబీల డాటా, వెయ్యి ఎస్‌ఎంఎస్‌లు నెల రోజులపాటు లభించనున్నాయి.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles