యాప్‌తో ఇంజినీరింగ్ చదువులు

Sun,February 17, 2019 12:30 AM

New app developed by Infosys for Engineering Students

ప్రత్యేక సర్వీసులు ఆవిష్కరించిన ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్..ఇంజనీరింగ్ విద్యార్థులకోసం ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా విడుదల చేసిన ఇన్ఫీటీక్యూ యాప్ ద్వారా ఆయా విద్యార్థుల చదువులకు సంబంధించిన కీలక అంశాలను నేర్చుకోవచ్చునని సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న మూడు, నాలుగో సంవత్సరం(ఇంజినీరింగ్) చదువుతున్న విద్యార్థులు ఈ యాప్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చును. నైపుణ్య కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు టెక్నికల్, అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్, ఆయా రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఈ నూతన ఆవిష్కరణ పరిష్కారం చూపనున్నట్లు కంపెనీ వర్గాల వెల్లడించాయి. మొబైల్ యాప్‌తోపాటు డెస్క్‌టాప్‌ల్లో కూడా లభించనున్న ఈ యాప్‌లో కంటెంట్, ఆయా కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, సర్టిఫికేషన్లను కూడా వెరిఫికేషన్ చేసుకునే వీలుంటుంది. విద్యార్థులు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడైన చదువుకోవడానికి వీలుగా ఇన్ఫీటీక్యూను తీర్చిదిద్దినట్లు, తద్వారా డిజిటల్ స్కిల్స్‌ను పెంపొందించడానికి ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఏకోసిస్టమ్‌ను తీర్చిదిద్దింది. అలాగే ఆర్గనైజేషన్లతో విద్యార్థులు నేరుగా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

విద్యా రంగంలో వస్తున్న పెనుమార్పులను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అలాగే విద్యార్థుల కుటుంబాలు తమ చదువుల గురించి ఆరా తీయడం మరింత సులభతరం కానున్నదని పేర్కొంది. తమ కోర్సులకు సంబంధించి టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్ అస్పెక్ట్స్‌ను కూడా నేర్చుకోవచ్చును. ఈ యాప్ ద్వారా అడ్వాన్స్ మెటిరియల్‌ను ప్రొవైడ్ చేస్తున్నట్లు, టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి వర్చ్యూవల్ ప్రొగ్రామింగ్ పరిస్థితులను క్రియేట్ చేయనున్నది.

862
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles