ఇండికేటర్లలో నెగటివ్ డైవర్జెన్స్

Fri,August 10, 2018 12:43 AM

Negative divergence in indicators

-అప్రమత్తంగా ఉండండి
టెక్నికల్స్: నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయిల్లో ముగిసినప్పటికీ రోజంతా స్వల్ప రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాలతో చిన్న బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. మార్కెట్ పెరుగుతూనే ఉన్నప్పటికీ అనేక టెక్నికల్ ఇండికేటర్లు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ఇండికేటర్లు ఓవర్‌బాట్‌లో ఉండడంతో పాటు నెగటివ్ డైవర్జెన్స్‌లు స్పల్పకాలిక కరెక్షన్‌కు సంకేతాలను ఇస్తున్నాయి. ఈ టెక్నికల్ అంశాలను పక్కనపెట్టి మార్కెట్ పెరిగితే ర్యాలీ 11,530 స్థాయి వరకూ పెరిగే అవకాశం ఉంది. గతనాలుగు రోజులుగా స్వల్ప రేంజ్‌లోనే మార్కెట్ ట్రేడ్ అవుతున్నందున పెద్ద కదలిక ఒకటి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి నిఫ్టీ క్రితం రోజు కనీస స్థాయిన దిగిపోనంత కాలం పాజిటివ్ మూమెంటమ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS