జీఎస్టీ నెట్‌వర్క్‌కు సైబర్ భద్రత చాలా కీలకం


Mon,June 19, 2017 02:50 AM

సమర్థవంతమైన ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసుకోవాలంటున్న నిపుణులు
cybersecurity
న్యూఢిల్లీ, జూన్ 18: షెడ్యూలు ప్రకారం జీఎస్టీని జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం వడివడిగా చర్యలు చేపడుతున్నది. మరోవైపు కార్పొరేట్ కంపెనీలు, రిటైల్, హోల్‌సేల్ వర్తకులు కూడా కొత్త పరోక్ష పన్నుల చట్టానికి అనుగుణంగా తమ కార్యకలాపాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, జీఎస్టీ అమలులో కీలకపాత్ర పోషించే ఐటీ నెట్‌వర్క్ భద్రత పెంచడం ఎంతో కీలకమని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం, సంస్థలు తమ నెట్‌వర్క్‌లోని కంప్యూటర్లలో సమాచార భద్రతను మరింత పటిష్ఠపరుచుకునేందుకు సమర్థవంతమైన ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదంటే హ్యాకర్లు భారీగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని వారంటున్నారు.

కొత్త పరోక్ష పన్నుల విధానంలో కంపెనీల వ్యాపార సమాచారం లీక్ అయ్యే ప్రమాదం మరింత పెరుగనుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్, సైబర్ సెక్యూరిటీ విభాగ లీడర్ శివరామ కృష్ణన్ అన్నారు. భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలను కనుగొనడంతోపాటు ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఆడిట్ సామర్థ్యాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులంటున్నారు. చిన్న సాంకేతిక సమస్యలు కూడా భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉందని, కాబట్టి కంపెనీలు జీఎస్టీ హయాంలో విస్తృతమైన సాంకేతిక మౌలిక వసతులు సమకూర్చుకోవాలని మొబీక్విక్‌కు చెందిన రోహన్ ఖారా సూచించారు. అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్ల (ఏఎస్‌పీ), జీఎస్టీ సువిధ ప్రొవైడర్ల(జీఎస్‌పీ) అప్లికేషన్లను వినియోగించే కంప్యూటర్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకోవచ్చని కృష్ణన్ హెచ్చరిస్తున్నారు.

175
Tags

More News

VIRAL NEWS