ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు గట్టి షాక్

Sat,August 10, 2019 12:53 AM

NDTV founders detained at Mumbai airport

-విదేశాలకు వెళ్ళకుండా ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి

ముంబై, ఆగస్టు 9: ఎన్‌డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసునకు సంబంధించి వీరిని విదేశాలకు వెళ్లనీయకుండా పోలీసు వర్గాలు అడ్గుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 16న భారత్‌కు తిరిగిరానున్న వీరిద్దరు ఎక్కడికి వెళ్లుతున్నారో మాత్రం తెలియరాలేదు. వీరిద్దరి అదుపులోని తీసుకున్న విషయంపై ముంబై విమానాశ్రయ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. నెలరోజుల క్రితం జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేష్ గోయల్ కూడా విదేశాలకు పారిపోవాలని చూశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెనక్కితగ్గాల్సి వచ్చింది. బ్యాంకును మోసం చేసిన కేసులో రాయ్‌కు సంబంధించిన ఆస్తులపై ఇటీవల సీబీఐ దాడుల చేసిన విషయం తెలిసిందే.

223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles