ఎన్‌బీఎఫ్‌సీలకు సంక్షోభ ముప్పు

Mon,May 13, 2019 12:07 AM

NBFCs are under threat of Crisis Manage

-బడా సంస్థల పొరపాట్లే కారణం
-కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్

న్యూఢిల్లీ, మే 12: నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగంలో సంక్షోభం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ హెచ్చరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ సంక్షోభం ప్రభావం మొత్తం దేశీయ ఎన్‌బీఎఫ్‌సీల రంగంపై పడిందన్న ఆయన కొన్ని బడా సంస్థల అత్యుత్సాహం, మితిమీరిన విశ్వాసంతో చేసిన సాహసాలు బెడిసి కొట్టడంతోనే కష్టాలన్నారు. వాస్తవ పరపతిని ఎక్కువగా చూపించుకోవడంతో నేడు సంక్షోభం ఛాయలు అలుముకుంటున్నాయని, రుణ లభ్యత కూడా కరువైపోయిందని చెప్పారు. పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం ఏర్పడే వీలున్నది. ఆ సంకేతాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. రుణ లభ్యత లేకపోవడం, మితిమీరిన పరపతి అంచనాలు, ఆస్తులు, అప్పులకు పొంతన లేకపోవడం, కొన్ని భారీ సంస్థల స్వయంకృతాపరాధాలు ఈ సంక్షోభానికి దారితీస్తున్నాయి అని శ్రీనివాస్ అన్నారు. అయినప్పటికీ బాధ్యతాయుత సంస్థలు.. రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు లేకపోలేదన్నారు.

ఇది కార్పొరేట్ పాలనకు పరీక్ష

కార్పొరేట్ సంస్థల్లో ఉన్న క్రమశిక్షణ, సుపరిపాలనకు ఇది పరీక్షా సమయం అని శ్రీనివాస్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పద్ధతిగా నడిచే సంస్థలను ఏ సంక్షోభం ఏమీ చేయలేదన్న ఆయన దేశంలో చాలా కంపెనీల్లో బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ ఉందని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఎలాంటి భయం లేదన్న ఆయన దారితప్పి నడిచే సంస్థలకు ఇబ్బందులు తప్పవన్నారు. వాస్తవాలను ఎంతోసేపు మరుగున పెట్టలేరని, చివరకు నిజాలు వెలుగుచూడక తప్పదన్న ఆయన నిబంధనలను ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles