చైనా మార్కెట్‌పై నాట్కో దృష్టి

Mon,August 12, 2019 02:18 AM

Natco Pharma to scale up business in China

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెటైన చైనాపై దేశీయ ఫార్మా కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన డాక్టర్ రెడ్డీస్, అరబిందో సంస్థలు ఇక్కడి మార్కెట్లో పట్టు సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయగా..తాజాగా ఇదే జాబితాలోకి మరో సంస్థ నాట్కో ఫార్మా చేరింది. అమెరికా నియంత్రణ మండలి కఠిన నిబంధనల నేపథ్యంలో అక్కడి మార్కెట్లో పట్టుకోల్పోతున్న సంస్థలు..ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంట్లోభాగంగా చైనా ప్రత్యామ్నాయం కనిపించిందని నాట్కో ఫార్మా సీఎండీ వీసీ నన్నపనేని వార్షిక నివేదికలో వెల్లడించారు. వ్యాపారాన్ని నూతన మార్కెట్లకు విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, ఆగ్నేసియా దేశాల్లో పట్టు మరింత సాధించడానికి భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన ఆయన ..ఆ దేశాల మార్కెట్లు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. స్వల్పకాలంపాటు భారత్, బ్రెజిల్, కెనడా దేశాల్లో మెరుగైన వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. చైనా మార్కెట్లో తొలుత ఆంకాలజీకి సంబంధించిన ఔషధాలను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ ఫార్మాస్యూటికల్స్ రంగంలో రెండో అతిపెద్ద మార్కెటైన చైనా..గతేడాదిలో 137 బిలియన్ డాలర్ల మేర నిధులు వెచ్చించారు. బీమా పరిధిని మరింత విస్తరించడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా హాస్పిటాల్టీ, ఆరోగ్య సేవలకు డిమాండ్ పెరిగింది. 2023 నాటికి చైనా ఫార్మా మార్కెట్ 3 శాతం నుంచి 6 శాతం వృద్ధితో 140-170 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.

242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles