నాట్కో లాభాల్లో క్షీణత

Wed,November 13, 2019 12:25 AM

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.117.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.181.60 కోట్ల లాభంతో పోలిస్తే 35 శాతం పడిపోయింది. రూ.583.50 కోట్ల నుంచి రూ.518.90 కోట్లకు ఆదాయం పడిపోయినట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అమెరికాలో ఒసెల్టామివిర్, భారత్‌లో హెప్ సీ ఔషధ విక్రయాలు భారీ గా పడిపోవడం వల్లనే ఆదాయం, లాభాలు పడిపోయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించిన రెండో మధ్యంతర డివిడెండ్ ఇది కావడం విశేషం.

161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles