సంస్కరణల్లో ఇక దూకుడు

Fri,May 24, 2019 12:34 AM

Narendra Modi with a clear majority of people in the general election

-వృద్ధిలోను కొనసాగనున్న జోరు
-ఎన్నికల ఫలితాలపై విశ్లేషకులు

న్యూఢిల్లీ, మే 23: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మెజార్టీతో నరేంద్ర మోదీ సర్కార్ ఆర్థిక సంస్కరణల్లో దూకుడు పెంచనున్నది. గత ఐదేండ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సర్కార్..వచ్చే ఐదేండ్లలోనూ ఇదే దూకుడు ప్రదర్శించనున్నదని, ముఖ్యంగా సంస్కరణల్లో వేగం పెంచనున్నదని బ్రోకరేజ్ సంస్థలు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో అత్యధిక మెజార్టీని సాధించిన ఎన్డీయే ప్రభుత్వానికి..ఎగువ సభయైన రాజ్యసభలో తగినంత మెజార్టీ లేకపోవడంతో సంస్కరణల అమలుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నదని ఐహెచ్‌ఎస్ మార్కిట్ వెల్లడించింది. సవాళ్లు ఉన్నప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు వృద్ధిరేటులో కొంత ఇబ్బందులు తప్పవని, అయినప్పటికీ 2019-23 మధ్యకాలంలో సరాసరిగా వృద్ధి 7 శాతం స్థాయిలో ఉంటుందని అంచనావేస్తున్నది. 2019లో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్..ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్‌ను దాటేసి 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనున్నదని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి జపాన్‌ను దాటేసి ఆసియా పసిఫిక్ దేశాల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించనున్నదని వెల్లడించాయి.

నూతన ప్రభుత్వానికి సవాళ్లు తప్పవు..

నూతన ప్రభుత్వానికి సవాళ్లు స్వాగతం చెబుతున్నాయని, ప్రస్తుత వృద్ధిరేటు ఆమోదయో గ్యం కాదని, ఇంకా వేగవంతమైన వృద్ధిని సా ధించాల్సిన అవసరం ఉన్నదని డన్ అండ్ బ్రా డ్‌స్ట్రీట్ ప్రధాన ఆర్థికవేత్త అరున్ సింగ్ తెలిపా రు. దేశీయ డిమాండ్‌కు ఊతమిచ్చినట్లు అవుతున్నప్పటికీ.. విమానయానం, విద్యుత్, బ్యాం కింగ్, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారించాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచడానికి ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ప్రైవేట్ రంగ సంస్థలు ఇన్వెస్ట్ చేయడానికి జంకుతున్నాయని, నూతన ప్రభుత్వం మౌలిక, ఇతర రంగాలపై భారీగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు సంస్థాగత సంస్కరణల్లో భాగంగా భూసేకరణ, రికార్డుల డిజిటలైజేషన్, కార్మిక చట్టాలు, ప్రైవేటైజేషన్, ఎగుమతులను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని గోల్డ్‌మెన్ సాక్స్ అభిప్రాయపడింది.

ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం: ఫిచ్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో వ్యాపార సానుకూల పరిస్థితులు మెరుగుపడటంతోపాటు ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చినట్లు అవనున్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles