నాలుగేండ్లలో 15 మిలియన్ టన్నులు

Wed,June 13, 2018 12:29 AM

My Home Industries awaits board nod for cement capacity expansion

సిమెంట్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న మై హోమ్ ఇండస్ట్రీస్
maha-cement
హైదరాబాద్, జూన్ 12: రాష్ర్టానికి చెందిన మహీ సిమెంట్ ఉత్పత్తి సంస్థ మై హోమ్ ఇండస్ట్రీస్ తన సామర్థాన్ని భారీ స్థాయిలో పెంచుకుంటున్నది. వచ్చే నాలుగేండ్లకాలంలో సిమెంట్ ఉత్పత్తిని 15 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ విజయ్ వర్ధన్ రావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ, ఏపీలోని కర్నూల్, వైజాగ్, తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో ఉన్న ప్లాంట్ల ద్వారా ప్రతియేటా 10 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతమేర పెట్టుబడులు పెట్టేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వచ్చే రెండు రోజుల్లో బోర్డు సమావేశం జరుగుతుండటం వల్లనే పెట్టుబడుల విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. రూ.4 వేల కోట్ల విలువైన మై హోమ్ గ్రూపునకు సిమెంట్ ద్వారా రూ.2,800 కోట్లు సమకూరుతున్నదని మహా డీహెచ్ సిమెంట్ ప్లస్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పాత సిమెంట్ బస్తా ధర కంటే ఇది రూ.40 ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కర్నూల్, వైజాగ్‌లలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాల్లో అధిక మన్నిక, స్థిరత్వం కలిగిన సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నది.

1097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles