ఎస్‌బీఐకి ఝలక్


Tue,March 13, 2018 03:13 AM

కార్డు పరిమితి రూ.13 వేలైతే.. రూ.9 కోట్ల కొనుగోళ్లు చేశాడు!

sbi.jpg
న్యూఢిల్లీ, మార్చి 12: పరిమితికి మించి ఎస్‌బీఐ కార్డు ద్వారా కోట్ల రూపాయల్లో ఆన్‌లైన్ షాపింగ్ జరిపాడో ముంబై వాసి. రూ.13,000 (200 డాలర్లు) దాటి కొనుగోళ్లు చేయలేని కార్డుపై బ్రిటన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఏకంగా రూ.9.1 కోట్ల (1.41 మిలియన్ డాలర్లు) బిల్లులు చేశాడు. ఎస్‌బీఐ ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నవీ ముంబైలోగల ఎస్‌బీఐ ఎన్నారై సీవుడ్స్ శాఖ.. యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌కు ఫారిన్ ట్రావెల్ కార్డులను జారీ చేసింది. ఒక్కో కార్డుపై ఖర్చుకున్న పరిమితి 200 డాలర్లు మాత్రమే. అయితే సందీప్ కుమార్ రఘు పూజారి అనే ఉద్యోగి 2016, నవంబర్ 8 నుంచి 2017, ఫిబ్రవరి 12 మధ్య 1.41 మిలియన్ డాలర్ల విలువైన దాదాపు 374 లావాదేవీలు జరిపాడు. నెటెల్లర్‌డాట్‌కామ్, ఎంట్రోపే, స్విఫ్ట్‌వోచర్, ఎస్‌కేఆర్ శ్రిల్‌డాట్‌కామ్ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్లపై ఈ లావాదేవీలు జరుగగా, ఈ సమాచారాన్ని సంస్థ సీవోవో బ్యాంకుకు 2017, ఫిబ్రవరి 28న అందించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మోసపూరితంగా సందీప్‌కు మొత్తం 3 కార్డులందినట్లు బ్యాంక్ ఆరోపిస్తుండగా, సందీప్‌తోపాటు మరికొందరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, ఐటీ చట్టం ఉల్లంఘనల కింద కేసులు నమోదయ్యాయి.

1902
Tags

More News

VIRAL NEWS