కొనుగోలుదారుల పరిరక్షణలో వృత్తి నిపుణులు కీలకం

Fri,February 22, 2019 12:50 AM

Multiple proceedings on same issue not permissible under RERA 2016

-రెరా అథారిటీ ఛైర్మన్ రాజేశ్వర్ తివారీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మోసపూరిత డెవలపర్ల నుంచి ఇండ్ల కొనుగోలుదారుల్ని రక్షించడంలో వృత్తి నిపుణులదే ముఖ్య భూమిక అని తెలంగాణ రెరా అథారిటీ ఛైర్మన్ రాజేశ్వర్ తివారీ తెలిపారు. గురువారం మాసబ్‌ట్యాంకులోని రెరా కార్యాలయంలో.. ఛార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులకు రెరాపై ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెరా దరఖాస్తు పత్రాల్ని నింపేటప్పుడు తప్పుడు సమాచారాన్ని ఇవ్వకూడదన్నారు. నిర్మాణ పనుల్లో పురోగతిని క్రమం తప్పకుండా సమాచారాన్ని అందజేయాలన్నారు. తెలంగాణ రెరా సభ్య కార్యదర్శి కొమ్ము విద్యాధర్ మాట్లాడుతూ.. రెరాకు కొందరు రియల్టర్లు సమర్పించిన దరఖాస్తుల్లో లోపాలున్నాయని వివరించారు. నిర్మాణంలో వినియోగించే సొమ్ముకు సంబంధించిన వివరాల్ని పొందుపర్చాల్సిన బాధ్యత ఛార్టెడ్ అకౌంటెంట్లపై ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో ఛార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజినీర్లు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles